మెట్టుగుట్ట శివరాత్రి జాతర టెండర్లు ఖరారు
మెట్టుగుట్ట శివరాత్రి జాతర టెండర్లు ఖరారు లడ్డు–పులిహోర హక్కు రూ.90 వేలకు వేలం కొబ్బరికాయలు, చెరుకు బండ్ల వేలం వాయిదా కాకతీయ, మడికొండ : వరంగల్ మహానగరంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మెట్టుగుట్ట ఆలయంలో 2026 మహాశివరాత్రి జాతర ఉత్సవాల నిర్వహణకు సంబంధించి శుక్రవారం టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. దేవస్థాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ చేపట్టారు. జాతర సందర్భంగా లడ్డు–పులిహోర విక్రయ హక్కును రూ.90,000కు వరంగల్‌కు చెందిన ఎన్.ప్రసాద్ అత్యధిక బిడ్‌తో దక్కించుకున్నారు. అలాగే అభిషేకం...