రోడ్లపై ఫర్నిచర్ విక్రయిస్తే కేసులు తప్పవు
రోడ్లపై ఫర్నిచర్ విక్రయిస్తే కేసులు తప్పవు ట్రాఫిక్ సీఐ సుజాత హెచ్చరిక కాకతీయ, ఖిలావరంగల్ : రహదారులపై ఫర్నిచర్ ఉంచి విక్రయాలు నిర్వహిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ట్రాఫిక్ సీఐ సుజాత స్పష్టం చేశారు. ఖిలావరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో కొంతమంది వ్యాపారులు రోడ్డుపై పాత ఫర్నిచర్ ఉంచి అమ్మకాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ సీఐ సుజాత సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రహదారిపై కుర్చీలు,...