భక్తులకు సులభ దర్శనమే లక్ష్యం

భక్తులకు సులభ దర్శనమే లక్ష్యం వేముల‌వాడ‌లో మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన క‌లెక్ట‌ర్‌ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ మహేష్ బి గితే, వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి ఐపీఎస్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి...