ప‌ట్టించుకోరా? చౌరస్తాలోనే చేపల అడ్డాలు చోద్యం చూస్తున్న పాలకులు అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం చేపల మార్కెట్‌ను మలుపు నుంచి తొలగించాలని డిమాండ్ కాకతీయ, రాయపర్తి: మండల కేంద్రంలోని ప్రధాన కూడలి రాజీవ్ చౌరస్తా వద్ద వెలిసిన చేపల మార్కెట్ స్థానికులకు, వాహనదారులకు నరకాన్ని చూపిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో ఇష్టారాజ్యంగా చేపల విక్రయాలు జరపడం వల్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. చేపలు కొనడానికి వచ్చే వారు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను రోడ్డుకు అడ్డంగా, మలుపు మధ్యలోనే...