వ్యాలిడేషన్ చట్టం–2025 రద్దు చేయాలి
వ్యాలిడేషన్ చట్టం–2025 రద్దు చేయాలి తహసిల్దార్ ద్వారా ప్రధానికి వినతిపత్రం సమర్పణ కాకతీయ, తుంగతుర్తి : వ్యాలిడేషన్ చట్టం–2025ను వెంటనే రద్దు చేసి, పెన్షన్ దారుల హక్కులను కాపాడాలని తుంగతుర్తి మండల పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పాలవరపు సంతోష్ డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు, జీవన వ్యయాలకు అనుగుణంగా పెన్షనర్లకు లభించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఈ చట్టం దెబ్బతీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని పార్లమెంటులో పునర్విమర్శ చేసి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు భరోసా కల్పించాలని,...