వేగం కాదు..ప్రాణ‌మే మిన్న‌

వేగం కాదు..ప్రాణ‌మే మిన్న‌ డ్రైవింగ్‌లో నియంత్ర పాటించాలి తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు కాకతీయ, తుంగతుర్తి : డిఫెన్స్ డ్రైవింగ్ పాటిస్తూ నిదానంగా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు తెలిపారు. ప్రతి వాహనదారుడు రహదారి నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. తుంగతుర్తి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలు, వాహనదారులకు హెల్మెట్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్ ప్రమాదాలు, పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు....