సర్పంచులు ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేయాలి

సర్పంచులు ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేయాలి గ్రామాల అభివృద్ధిపై ప్ర‌ణాళిక‌తో ఉండాలి వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ, గీసుగొండ : గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సర్పంచులు పర్యవేక్షణ, పట్టుదలతో పని చేయాలని వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని, కార్యక్రమాన్ని “జయ జయ హే తెలంగాణ” రాష్ట్ర గీతంతో ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...