బాధిత కుటుంబాలకు చల్లా పరామర్శ
బాధిత కుటుంబాలకు చల్లా పరామర్శ కాకతీయ, గీసుగొండ: అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ కార్యకర్తను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పరామర్శించారు. మండలంలోని కొనాయిమాకుల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గుండెకారి గట్టయ్య నివాసానికి వెళ్లిన ఆయన, మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. గట్టయ్య మృతికి గల కారణాలను ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే, రాంపురం గ్రామానికి చెందిన...