రీల్స్‌ మాయలో పడి.. రూ.87,810 పోగొట్టుకొని..

రీల్స్‌ మాయలో పడి.. రూ.87,810 పోగొట్టుకొని.. తక్కువ పెట్టుబడి.. అధిక లాభాలంటూ నమ్మించిన మోసగాళ్లు పోలీసులను ఆశ్రయించిన డిప్లొమా విద్యార్థి కాకతీయ, కరీంనగర్: సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, రీల్స్‌ను నమ్మి ఓ విద్యార్థి భారీగా నగదు పోగొట్టుకున్నాడు. తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చన్న ఆశతో ఏకంగా రూ.87,810లు సైబర్ నేరగాళ్ల పాలు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాకు చెందిన ఓ డిప్లొమా విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌ను చూశాడు. అందులో తక్కువ సమయంలో రెట్టింపు లాభాలు వస్తాయని ఉండటంతో సదరు...