ఉత్సాహంగా వేసవి హాకీ శిక్షణ శిబిరం

ఉత్సాహంగా వేసవి హాకీ శిక్షణ శిబిరం కాకతీయ, హుజురాబాద్: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ కార్యదర్శి బొడిగె తిరుపతి గౌడ్‌తో కలిసి శ్రీనివాస్ శిబిరాన్ని ప్రారంభించిన...