సీఎం రేవంత్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు
ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి మాటలు బీఆర్ ఎస్ నేతల ఆగ్రహం.. కాకతీయ, కరీంనగర్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు , కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషాన్ని...