మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించాలి
చింతకాని పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గజ్జెల నరేష్ కాకతీయ, ఖమ్మం టౌన్: మానవ అక్రమ రవాణాపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని చింతకాని పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గజ్జెల నరేష్ సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా బుధవారం చింతకాని మండలం పందిళ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీ రక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ గోంగూర...