కళాశాలలో కారు టెస్ట్‌ డ్రైవ్‌.. ప్రమాదం..!

కళాశాలలో కారు టెస్ట్‌ డ్రైవ్‌.. ప్రమాదం..! పని వేళల్లో టయోటా కారు టెస్ట్‌ డ్రైవ్‌ చేసిన అధ్యాపకురాలు ప్రమోషన్ల పేరుతో ప్రిన్సిపాల్‌ అత్యుత్సాహం? కాకతీయ, తెలంగాణ బ్యూరో : కళాశాలలో విద్యాబోధన సాగాల్సిన సమయంలో కారు టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. కారేపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లంచ్‌ బ్రేక్‌ సమయంలో కాకతీయ టయోటా సంస్థకు చెందిన కారును ప్రమోషన్‌ పేరుతో టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తుండగా అధ్యాపకురాలు ప్రమాదానికి గురయ్యారు. ప్రిన్సిపాల్‌ అనుమతితో కళాశాల ప్రాంగణంలోనే టెస్ట్‌ డ్రైవ్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి....