జనగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలి!
జనగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలి! కులాలవారీ లెక్కలతోనే బీసీల జనాభాపై స్పష్టత మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి కాకతీయ, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణనలో కులగణన చేపట్టి, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ కాలమ్‌ను తప్పనిసరిగా చేర్చాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి ఈ అంశంపై చర్చించారు. గతంలో కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ, ఆగస్టు 14న వెల్లడించిన 40 ప్రశ్నల్లో ఓబీసీ కాలమ్ లేదని...