బరువు తగ్గాలని నిమ్మరసం తాగేస్తున్నారా..? ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవు

నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ఔషధ గుణాలు అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అనేక ఇతర ఆరోగ్య సమస్యలను త్వరగా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి చాలా మంది రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని తాగుతుంటారు. ఈ లెమన్ వాటర్ శరీరంలోని నీటి కొరతను కూడా తొలగిస్తుంది. నిమ్మకాయలో విటమిన్-సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, విటమిన్-ఇ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదే కానీ అతిగా తాగడం...