జైలు నిర్బంధంలోనూ తెలంగాణ నినాదాన్ని వినిపించిన దాశరథి
జైలు నిర్బంధంలోనూ తెలంగాణ నినాదాన్ని వినిపించిన దాశరథి కొనియాడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాకతీయ, హైదరాబాద్ : నా తెలంగాణ కోటి రతనాల వీణ’ … అంటూ తెలంగాణ గరిమను, తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప తెలంగాణ కవి, దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు.. దాశరథి శత జయంతి సందర్భంగా వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. కవిగా, రచయితగా, తెలంగాణ అస్మితను, తన ప్రాంత ప్రజల కష్టాలను, ప్రపంచానికి వినిపించిన తెలంగాణ గర్వించదగ్గ భూమి పుత్రుడు దాశరథి...