తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప్రైవ‌సీ లేదు : బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప్రైవ‌సీ లేదు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంలో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప్రైవ‌సీ లేకుండా పోయింద‌ని బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విష‌యంలో త‌న‌కు నోటీసులు వ‌స్తున్నాయ‌ని ఓ వారం రోజుల ముందుగానే ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక రాసింద‌న్నారు. ఎంతో గోప్యంగా జ‌రుగుతున్న కేసుల‌ విష‌యాల‌ను కూడా ర‌న్నింగ్ కామెంట‌రీలా సీఎం స‌ద‌రు దిన‌ప‌త్రిక యాజ‌మాన్యానికి లీక్ చేస్తున్నారంటూ ప్ర‌వీణ్‌కుమార్ ఆరోపించారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ప్ర‌వీణ్‌కుమార్...