ధన్‌ఖడ్ రాజీనామాకు కారణం ఎవరు..?
ధన్‌ఖడ్ రాజీనామాకు కారణం ఎవరు..? ఉపరాష్ట్ర పతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అనారోగ్య కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ధన్‌ఖడ్ లేఖలో పేర్కొన్న దీని వెనుక మాత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దల రాజకీయం ఉన్నట్లుగా విశ్లేషణలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మనసెరిగి కాకుండా.. విపక్షాల విమర్శలకు, విధానాలకు ఊతం ఇచ్చేలా ధన్‌ఖడ్ వ్యవహరించారన్న అభిప్రాయం బీజేపీ పార్లమెంటరీ సభ్యుల్లో వ్యక్తమైనట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అధికార పక్షం.. విపక్షాల మధ్య లోక్‌సభ,...