జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ బీఆర్ గవాయ్
జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ బీఆర్ గవాయ్ కాకతీయ, న్యూఢిల్లీ : అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు సీజేఐ బీఆర్ గవాయ్ తెలిపారు. ఇన్‌హౌజ్ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పిటీషన్‌పై విచారణలో పాల్గొనడం లేదని సీజేఐ గవాయ్ అన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో భారీ స్థాయిలో నోట్ల కట్టలు దొరికిన కేసులో జస్టిస్...