సత్య మేవ జయతే..!
సత్య మేవ జయతే..! సత్యం ఎక్కడైనా.. ఎన్నంటికైనా గెలుస్తుందనేది ఈ నానుడి సందేశం. సత్యమే గెలవాలని.. సత్యాన్నే గెలిపించాలనే లక్ష్యంతో కాకతీయ మీడియాను ప్రారంభిస్తున్నాం. డిజిటల్ మీడియా ఫార్మాట్‌లో దినపత్రిక, వెబ్సైట్‌తో పాటు యూట్యూబ్‌ను ఆరంభిస్తున్నాం. ఒక సమున్నత లక్ష్యంతో కాకతీయ మీడియాను స్టార్ట్ చేయడం జరుగుతోంది. అన్ని ఫార్మాట్లలో ఎప్పటికప్పుడు వార్తలు, విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక కథనాలను అందించే విధంగా వ్యవస్థలను రూపొందించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠకలోకానికి కొన్ని స్పష్టమైన వాగ్దానాలు చేయదల్చుకున్నాం. సత్యాన్ని గెలిపించేందుకు కలం కవాతు చేసేందుకు మంచికి-మంచి. చెడుకు-...