బీజేపీ గూటికి గువ్వ‌ల.. కాషాయం కండువా క‌ప్పుకున్న మాజీ ఎమ్మెల్యే

బీజేపీ గూటికి గువ్వ‌ల కాషాయం కండువా క‌ప్పుకున్న మాజీ ఎమ్మెల్యే కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుంచి గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన గువ్వ‌ల గ‌త కొంత‌కాలంగా బీజేపీలో చేరుతున్న‌ట్లుగా ఊహాగానాలు వినిపించ‌గా.. ఇటీవ‌ల ఆయ‌నే స్వ‌యంగా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. చెప్పిన‌ట్లుగా ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు , రాజ్యసభ సభ్యులు...