శ్రీ మహాదేవ స్వామి ఆలయంలో వైభవంగా అభిషేకం..!!

కాకతీయ, హనుమకొండ/రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల కేంద్రంలోని శ్రీ మహాదేవ స్వామి ఆలయంలో శ్రావణ మాస మూడవ సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసి, హారతుల ధ్వనులు మార్మోగాయి. ఆలయ కమిటీ చైర్మన్ కూరెళ్ళ పెద్ద ఉపేందర్ గుప్తా, రేణుక దంపతులు మాట్లాడుతూ.. మహాదేవుడి ఆశీస్సులు అందరికీ లభించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ వాసులు హరీష్–కవిత దంపతులు, సీనియర్ జర్నలిస్టు చింతకింది కృష్ణమూర్తి–రాజేశ్వరి,...