వ్యవసాయ రంగాన్ని పరిశ్రమ రంగంగా గుర్తించాలి : నేదునూరి జ్యోతి
కాకతీయ, హనుమకొండ : దేశ వ్యవసాయ రంగాన్ని పరిశ్రమ రంగంగా గుర్తించి, భూమిలేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక ఎకరం సాగు భూమి ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామంలో జరిగిన సి పి ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో 80 కోట్ల ఎకరాల భూసంపద ఉండగా 15 కోట్ల ఎకరాలు సాగులోకి రానివని, వాటిని వినియోగంలోకి తేవాలని సూచించారు. రైతు పంటలకు పెట్టుబడికి 50శాతం...