హర్ ఘర్ తిరంగాపై బిజెపి మండల స్థాయి సమావేశం..!!
కాకతీయ, బయ్యారం: మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగాపై మండల స్థాయి కార్యశాల కార్యక్రమాన్ని. సోమవారం నిర్వహించారు.మండల బీజేపీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది . కార్యక్రమం నాకు ముఖ్య అతిధిగా రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి భూక్యా శ్రీనివాస్ హాజరై, కార్యశాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురష్కరించుకొని పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలిసి హర్ ఘర్ తిరంగ యాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశ సమైక్యత, సమగ్రతకోసం ప్రతిజ్ఞ చేయాలన్నారు.భారత...