దద్దరిల్లిన పార్లమెంట్.. ఉభ సభలు వాయిదా..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రతిపక్షాల ఆందోళనలతో దద్దరిల్లింది పార్లమెంట్. సోమవారం ఉదయం ఉభయ సభలు ప్రారంభమవ్వగానే బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చ నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై డిబేట్ నిర్వహించాల్సిందేనంటూ పట్టుబట్టాయి. బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కైందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశాయి. స్పీకర్ సముదాయించేందుకు ఎంత ప్రయత్నించినా విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. పరిస్థితి సద్దుమణగకపోవడంతో పార్లమెంట్...