జైల్లో పెడితే గొంతు నొక్కినట్లు కాదు.. రాహుల్ గాంధీ ఎపిసోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఓట్ల చోరీని అడ్డుకోవాలని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా ఈసీ ఆఫీసుకు ర్యాలీ చేస్తున్న నేతలను అమానవీయంగా అడ్డుకోవటం దుర్మార్గమైన చర్య అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. రాహుల్ గాంధీ, ఇటీవల ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రత గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద్యమం భాగంగా ఆయన...