తాటాకు చప్పులు కాదు.. ప్రజల మద్దతే బలం: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి

కాకతీయ, హనుమకొండ/తొర్రూరు : కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని రాబోయే ఎన్నికల్లో ఎగర వేయడానికి గ్రామం నుండి పట్టణం వరకు ప్రతి స్థాయిలో సమైక్యంగా పని చేయాలి. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం ముందుకు సాగాలి అని ఝాన్సి రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తొర్రూరు పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, వార్డు కోఆర్డినేటర్లు, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి అందరూ...