ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో డి-వార్మింగ్ డే.. పాల్గొన్న జిల్లా కలెక్టర్..!!

కాకతీయ, గీసుగొండ: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో డి-వార్మింగ్ డే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారదా దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు నులిపురుగులు అడ్డంకిగా మారుతాయని, అందుకే సమయానికి మందులు వేసుకోవాలని సూచించారు. ఆగస్టు 10న వేసుకొని వారు ఆగస్టు 18న మాప్-అప్ డేలో తప్పక మందు తీసుకోవాలని కోరారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను...