నులిపురుగుల నివారణ.. జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 18 వరకు మాత్రల పంపిణీ.!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో/పాల్వంచ : విద్యార్థుల విద్యా ప్రగతికి శారీరక, మానసిక ఆరోగ్యం కీలకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అంతర్జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా సోమవారం పాల్వంచ బొల్లారిగూడెం మైనారిటీ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నులిపురుగులు పిల్లలలో పోషకాహార లోపం, రక్తహీనత, ఆకలి తగ్గడం, అలసట, కడుపు నొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలకు కారణమవుతాయని, ఇవి వారి శారీరక...