చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా సహా పలు చిత్రాలకు బ్రేక్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : టాలీవుడ్‌లో గత వారం రోజులుగా సాగుతున్న సినీ కార్మికుల సమ్మె చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ తో జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోమవారం నుండి షూటింగ్స్ బంద్ అని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. సమ్మె ప్రభావంతో చిరంజీవి.. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం, అలాగే నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2 వంటి చిత్రాల షూటింగ్స్ నిలిచిపోవనున్నాయి. దీంతో బడ్జెట్ పెరుగుదల, రిలీజ్ డేట్ వాయిదా సమస్యలు...