ఇంచర్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రులు..సాకరమవుతున్న రైతుల కల
కాకతీయ, వెబ్‌డెస్క్: దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు ములుగు జిల్లా ఇంచర్ల శివారులో ప్రైవేట్ కంపెనీతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందుకోసం 12 ఎకరాల భూమిని కేటాయింది. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసేందుకు సోమవారం మంత్రులు రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్ , సహకారం, చేనేతలు, వస్త్రాలు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్...