ప్రభుత్వం ఆ పని చేస్తోందా? పార్లమెంట్‌లో ఒవైసీ సూటి ప్రశ్న!
కాకతీయ, నేషనల్ డెస్క్: సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక ప్రశ్నలు లేవనెత్తారు. దేశవ్యాప్తంగా మైక్రోఫైనాన్స్ రుణాల బకాయిలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సమస్యపై ప్రభుత్వ అవగాహన, విశ్లేషణ, పరిష్కార చర్యలపై ఆయన వివరణ కోరారు. ఒవైసీ ప్రశ్నిస్తూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మైక్రోఫైనాన్స్ రుణాల బకాయిలు 163 శాతం పెరిగి రూ. 43,000 కోట్లకు చేరుకున్నాయని అన్నారు. ఈ పెరుగుదల ప్రత్యేకించి చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్న...