మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, పరువు హత్యలను నివారించాలి: పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ

కాకతీయ, బయ్యారం: పిఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ను మండల కేంద్రము లోని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు.ఈ సమావేశంలొ దేశ వ్యాప్తంగా,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక కార్యక్రమాల గురించి చర్చించి,భవిష్యత్ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర అధ్యక్షులు అనసూయ,ప్రధాన కార్యదర్శి అందె మంగ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింస దౌర్జన్యాలు ,పరువు హత్యలు పెరిగిపోయాయని, కర్ణాటకలోని ధర్మస్థలలో...