సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్ని రకాలు సాయం చేస్తాం: భట్టి విక్రమార్క
కాకతీయ, తెలంగాణ బ్యూరో: సివిల్స్ లో తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపికవ్వాలనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఆయన ప్రజాభవన్లో సింగరేణి ఆధ్వర్యంలో మెయిన్స్ కు ఎంపికైన 178 మందికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మానవ వనరులు అతి ముఖ్యమైనవి అవి బలమైన పెట్టుబడులని, ఆ మానవ వనరులను సానబట్టి వజ్రాలుగా తయారు చేస్తే సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా...