ఎల్బీనగర్‌లోని ఓ కాలేజీలో గ్యాంగ్ వార్ కలకలం..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో శుక్రవారం చోటుచేసుకున్న విద్యార్థుల గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవినాష్ కాలేజీకి చెందిన రెండు గ్యాంగులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. కర్రలు, రాడ్లు, రాళ్లతో జరిగిన ఈ దాడిలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు ప్రకారం.. ఈ కాలేజీ విద్యార్థుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీ సమీపంలోని రహదారులపై భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న...