వరదనీటిలో తేలుతున్న వరంగల్ .. నీటిలో కొట్టుకు పోయిన కారు..!!
కాకతీయ, వరంగల్ సిటీ: వరంగల్ లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరంగల్ లోని పలు కాలనీలు నీటమునిగాయి. రాత్రికి రాత్రే అతి భారీ వర్షం కురవడంతో లోతట్టు కాలనీలు అన్ని వరద నీటితో మునిగాయి. రాత్రి కావడంతో పలు కాలనీ వాసులు వదరనీటిలోనే చిక్కుకున్నారు. ముఖ్యంగా వరంగల్ లోని వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, మధురానగర్, శివనగర్, ఎన్టీఆర్ నగర్ లు వరద ముంపుకు గురయ్యాయి. అతి భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తమైన వరంగల్ మహా నగర పాలక...