భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ డా. సత్య శారద

కాకతీయ, వరంగల్ సిటీ : భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించారు. సమర్థవంతం గా చర్యలు చేపట్టాలంటూ అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని నాలుగు మండలాలలైనా వరంగల్,...