మాకు పెద్ద టోపీ పెట్టారు.. అయినా రోడ్లు అభివృద్ధి చేస్తాం.. డీప్యూటీ సీఎం మాస్ డైలాగ్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ లక్ష్యాలు సాధించేందుకు కోరి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ లక్ష్యాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. రహదారులు నాగరికతకు చిహ్నాలు, రహదారులు అభివృద్ధి జరిగితే మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కడికైనా ఉత్పత్తి అయిన వస్తువులను సునాయాసంగా తరలించవచ్చని అన్నారు. రహదారుల నిర్మాణంతో పరిశ్రమలు పెరిగి తద్వారా మన రాష్ట్ర యువతకు...