ప్రేమే జీవితం.. సేవే మార్గం.. అమరావతిలో బాలకృష్ణ క్యాన్సర్ ఆస్పత్రి..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్..ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఆసుపత్రి భూమిపూజను తుళ్లూరు సమీపంలో బుధవారం ఉదయం సంస్థ ఛైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ నిర్వహించారు. భూమి పూజ అనంతరం బాలక్రిష్ణ మాట్లాడుతూ.. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందన్నారు. తర్వాత కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పాడ్డాయని తెలిపారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. దీంతో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయామని...