గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా ఏపీ : సీఎం చంద్రబాబు

 కాకతీయ, అమరావతి: గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా ఏపీని తీర్చిద్దిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ మారుతున్న డైనమిక్స్ కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, విద్యుత్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కే.విజయానంద్, ఏపీ ట్రాన్స్...