రైతులకు యూరియా కష్టాలు..!!

కాకతీయ, నెల్లికుదురు: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి యూరియా కోసం రైతులు బుధవారం పోటెత్తారు. పంటలకు నత్రజని అందించే సీజన్ కావడంతో ఒకేసారి వివిధ గ్రామాల నుంచి నెల్లికుదురు పిఎసిఎస్ కు తరలిరావడంతో చాలా సమయం పాటు బారులు తీరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సమయాన్ని వెచ్చించి యూరియా కోసం క్యూలైన్లలో నిలబడి ఉండడం భరించలేకపోతున్నామని వెంటనే ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. ఓ పక్క వ్యవసాయాధికారులు యూరియా కొరత లేదని ప్రకటిస్తున్నారని, ఇక్కడేమో యూరియా కొరతతో రైతులు గంటల...