గన్ మిస్‌ఫైర్.. తృటిలో తప్పిన ప్రమాదం..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో ఉదయం గన్ మిస్‌ఫైర్ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. సీఐ అనిల్ కుమార్ తన గదిలో సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా, అనుకోకుండా ట్రిగర్‌కు చేయి తగలడంతో బుల్లెట్ పేలింది. ఆ బుల్లెట్ పక్కన నిలబడి ఉన్న హెడ్ కానిస్టేబుల్ పక్కగా దూసుకెళ్లింది. క్షణం ఆలస్యం అయితే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ఈ ఘటనతో కార్యాలయంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని...