పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్..!

కాకతీయ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలపై రాజస్థాన్‌లో 32 ఏళ్ల మహేంద్ర ప్రసాద్‌ను సిఐడి ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. జైసల్మేర్‌లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో ఉన్న డి ఆర్ డి ఓ గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ దేశ రహస్యాలు, వ్యూహాత్మక సమాచారం పాకిస్తాన్‌కు చేరవేస్తున్నాడని దర్యాప్తులో బయటపడింది. ఉత్తరాఖండ్‌ లోని అల్మోరాకు చెందిన మహేంద్ర ప్రసాద్, సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూ,...