డిజిపి ఆఫీసులో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: నషా ముక్త్ భారత్ అభియన్ లో భాగంగా హైదరాబాద్ లోని డిజిపి కార్యాలయంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్( పి అండ్ ఎల్ ) శ్రీ ఎం. రమేష్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల హానికరమైన ప్రభావం నుండి సమాజాన్ని, ముఖ్యంగా యువతను రక్షించడానికి పోలీసు లు నిబద్ధతను పునరుద్ఘాటించడ కోసం ప్రతిజ్ఞ చేశారు . ఈ సందర్భంగా ఐజిపి శ్రీ ఎం.రమేష్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుర్వినియోగం చేయడం వల్ల ప్రజారోగ్యం, భద్రత , యువతరం...