లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపర్చిన సిట్..!!
కాకతీయ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నేడు బుధవారం లిక్కర్ స్కాము కేసులో 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరపరిచారు. ఈ క్రమంలో కోర్టులో రాజ్ కసిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సిట్ అధికారులపై విమర్శలతో విరుచుకుపడ్డారు రాజ్ కసిరెడ్డి. హైదరాబాద్ లో లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా సిట్ సీజ్ చేసిన రూ. 11కోట్లపై తనకు అనుమానాలు ఉన్నాయని కోర్టులో వాదించారు రాజ్ కసిరెడ్డి. అధికారులు రూ. 11కోట్ల విషయంలో...