సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తాం.. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై రాంచందర్ రావు డిమాండ్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : వామన్ రావు.. నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు స్వాగతించారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాల విచారణ సంస్థలపై పెరుగుతున్న ప్రజా అవిశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం, న్యాయం పట్ల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుందని రాంచందర్ రావు అన్నారు. స్థానిక విచారణ సంస్థలు నిజాన్ని వెలికితీయడంలో విఫలమయ్యే భయం, సాక్ష్యాల...