ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. నిర్మాత అల్లు అరవింద్ హాట్ కామెంట్స్..!!

కాకతీయ, సినిమా డెస్క్: చిత్రపరిశ్రమలో ఎవరి కుంపటి వారమిదేనంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. సైమా ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడారు. ఎవరికైనా నేషనల్ అవార్డు వచ్చినట్లయితే పండగలా జరుపుకోవాలి. కానీ చిత్రపరిశ్రమలో అలాంటి వాతావరణమే లేదన్నారు. తెలుగు సినిమాకు 7 జాతీయ అవార్డులు వచ్చినా ఇండస్ట్రీ స్పందించకుముందే సైమా వాళ్లు స్పందించి వారందరినీ స్టేజ్ పైకి తీసుకువచ్చి సత్కరించుకోవాలనుకోవడం చాలా ప్రశంసనీయ విషయమన్నారు. విజేతలందరికీ నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలుగు సినిమాకు నేషనల్ అవార్డులు వచ్చిన సందర్భాన్ని...