జమ్మూ కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్..46 మంది దుర్మరణం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: జమ్మూకశ్మీర్ లోని చోసిటీలో గురువారం చోటుచేసుకున్న భారీ క్లౌడ్ బరస్ట్ పెను విషాదాన్ని మిగుల్చింది. ఒక్కసారిగా మెరుపు వరదలు రావడంతో భారీ విషాదం నెలకొంది. ఇప్పటి వరకు 46 మంది మ్రుతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండటంతో మరణించినవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సహాయ, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు CRPF జవాన్లు సహా 46 మంది మరణించారు. 120 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 250 మంది...