కోస్తాకు వరద ముప్పు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, క్రిష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఫ్లాష్ ప్లడ్ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ కేంద్రం...