హడలెత్తిస్తున్న హైడ్రా.. చెరువులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ తొలగింపు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమమని తెలిస్తే చాలు.. పంజా విసురుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామంలో చిన్న చెరువులో అక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో పూజ క్రాప్టెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థ దాదాపు రెండున్నర ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టింది. మట్టి నింపి..రహదారులు కూడా వేసింది. అయితే వీటన్నింటినీ హైడ్రా తొలగించేసింది. చెరువులో నింపిన మట్టిని కూడా టిప్పర్లతో, జేసీబీలతో తొలగించింది. పూజ క్రాప్టెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థకు చెందిన స్థలంలో వేసింది. ఇదే సమయంలో...